Pawan Kalyan: జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ పై క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు.. వలంటీర్‌ స్టేట్‌మెంట్ రికార్డ్

By Mahesh RajamoniFirst Published Aug 19, 2023, 2:03 AM IST
Highlights

Vijayawada: గ‌త నెల 9న ఏలూరులో వార్డు, గ్రామ వాలంటీర్లపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై పరువు నష్టం దావా న‌మోదైంది. మహిళలు, బాలికల అదృశ్యం, మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల ప్రమేయం ఉందన్న కళ్యాణ్ ఆరోపణ తనను మానసిక వేదనకు గురిచేసిందనీ, ప్రభుత్వ సేవలు అందిస్తున్న లక్షలాది మంది వాలంటీర్ల ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఓ మహిళా వాలంటీర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే వలంటీర్‌ పిటీషన్‌ను కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.
 

Criminal defamation case filed against Pawan Kalyan: గ‌త నెల 9న ఏలూరులో వార్డు, గ్రామ వాలంటీర్లపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై పరువు నష్టం దావా న‌మోదైంది. మహిళలు, బాలికల అదృశ్యం, మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల ప్రమేయం ఉందన్న కళ్యాణ్ ఆరోపణ తనను మానసిక వేదనకు గురిచేసిందనీ, ప్రభుత్వ సేవలు అందిస్తున్న లక్షలాది మంది వాలంటీర్ల ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఓ మహిళా వాలంటీర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే వలంటీర్‌ పిటీషన్‌ను కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.

వివ‌రాల్లోకెళ్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ చేసిన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై విజయవాడ సివిల్‌ కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కు వ్య‌తిరేకంగా కేసు ఫైల్ చేసిన‌ వలంటీర్‌ పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్‌ కేసు ఫైల్‌ చేసిన వలంటీర్‌ స్టేట్‌మెంట్‌ను న్యాయ‌మూర్తి శుక్ర‌వారం రికార్డు చేశారు.  పిటిషన్ వేసిన సందర్భంగా తమకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ కోరారు.

ప్ర‌భుత్వ సేవ‌లు అందిస్తున్న ఎంతో మంది వాలంటీర్ల‌పై జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు త‌న‌తో పాటు చాలా మందిని మాన‌సిక వేద‌న‌కు గురిచేశాయ‌ని ఫిర్యాదుదారైన వాలంటీర్ పేర్కొన్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని న్యాయ‌స్థానాన్నికోరారు. వలంటీర్‌ తరఫున లాయర్లు సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. అలాగే, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, ప్ర‌భుత్వ సేవ‌లు అందిస్తున్న వాలంటీర్ల‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు సంచలనం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సైతం పవన్ క‌ళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.

click me!