అక్రమ కట్టడాలు: మరో 10 మందికి సీఆర్‌డీఏ నోటీసులు

By narsimha lodeFirst Published Jun 29, 2019, 4:43 PM IST
Highlights

కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేస్తోంది.  శనివారం నాడు  మరో 10 మందికి నోటీసులు  ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలకు సీఆర్‌డీఏ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

అమరావతి: కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేస్తోంది.  శనివారం నాడు  మరో 10 మందికి నోటీసులు  ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలకు సీఆర్‌డీఏ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

నిబంధనలకు విరుద్దంగా  నిర్మించారనే కారణంగా ప్రజావేదికను కూల్చివేశారు. ఈ ప్రజావేదిక పక్కనే లింగమనేని రమేష్  నివాసంలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు. ఈ భవనం కూడ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని నోటీసులిచ్చారు.

తాజాగా గుంటూరు మాజీ జడ్పీ ఛైర్మెన్ పాతూరి నాగభూషణం భవనానికి కూడ నోటీసులు ఇచ్చారు. తులసీ గార్డెన్స్, లింగమనేని రమేష్,  చందన బ్రదర్స్, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు , శైవ క్షేత్రంలోని ఆరుగురికి సీఆర్‌డీఏ  అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు నిర్ణీత గడువులోగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.  

click me!