సింగపూర్ కు రాజధాని రైతులా ?

Published : Sep 27, 2017, 08:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సింగపూర్ కు రాజధాని రైతులా ?

సారాంశం

సింగపూర్ కు రాజధాని రైతులా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? చంద్రబాబునాయుడు నిర్ణయాలన్నీ ఇలానే ఉంటున్నాయి? అమరావతికి సింగపూర్ లాంటి రాజధాని సాధ్యం కాదనుకున్నారేమో? అందుకే సింగపూర్ కే అమరావతి రైతులను తీసుకెళ్ళాలని నిర్ణయించారు. ఎందుకంటే, ఇంతకాలం చంద్రబాబుతో పాటు ఎంతోమంది అధికారులు ఎన్నో సార్లు సింగపూర్ కు వెళ్ళి వచ్చారు.

సింగపూర్ కు రాజధాని రైతులా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? చంద్రబాబునాయుడు నిర్ణయాలన్నీ ఇలానే ఉంటున్నాయి? అమరావతికి సింగపూర్ లాంటి రాజధాని సాధ్యం కాదనుకున్నారేమో? అందుకే సింగపూర్ కే అమరావతి రైతులను తీసుకెళ్ళాలని నిర్ణయించారు. ఎందుకంటే, ఇంతకాలం చంద్రబాబుతో పాటు ఎంతోమంది అధికారులు ఎన్నో సార్లు సింగపూర్ కు వెళ్ళి వచ్చారు. రైతుల భూములను తీసుకుని వారి పేరు మీద ప్రపంచ దేశాలు తిరిగివచ్చినపుడు కనీసం వారిని సింగపూర్ కు అయినా తీసుకెళ్ళకపోతే బాగోదనుకున్నారేమో? అందుకనే ఓ 100 మంది రైతులను మూడు విడతలుగా తీసుకెళతారట. అందుకు అవసరమైన ఏర్పాట్లను సిఆర్ డిఏ చూస్తోంది.

అక్టోబర్ 22-26 మధ్య మొదటి విడత, రెండో విడత నవంబర్ 5-9, మూడో బ్యాచ్ ను నవంబర్ 19-23 మధ్య మూడో బ్యాచ్ ను తీసుకెళ్లాలని తేదీలను కూడా నిర్ణయించేసారు. సరే, రైతులే వెళతారో లేక ‘పచ్చనేత’లే వెళతారో ఇపుడే చెప్పలేమనుకోండి. వందమంది రైతులకన్నా ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటే మాత్రం లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారట. సెలక్ట్ అయిన రైతులు మూడు రాత్రుళ్ళు, నాలుగు పగళ్ళు, వసతి, స్ధానిక రవాణా సదుపాయాలను సిఆర్ఢిఏనే చూసుకుంటుందట.

అయితే, ఇక్కడే ఓ మెలికుంది. అదేంటంటే, రానుపోను విమాన ఛార్జీలు, వీసా ఫీజు, ఆరోగ్య బీమా తదితర ఖర్చులన్నింటినీ రైతులే భరించుకోవాలట. ఎలాగుంది చంద్రన్న బంపర్ ఆఫర్. రాజధాని నిర్మాణం పేరుతో రెండేళ్ళ క్రితమే చాలామంది రైతుల నుండి ప్రభుత్వం పచ్చని వ్యవసాయ భూములను తీసేసుకుంది. అప్పటి నుండి వ్యవసాయమే లేదు. అంటే రైతులకు సరైన ఆదాయమే లేదు. అటువంటిది ఇపుడు విమానఖర్చులు ఎవరికి వారే భరించుకోవాలంటే ఎంతమంది రైతులు ముందుకొస్తారు?

అసలు రైతులను రాజధానికి తీసుకెళ్ళాలన్నది దాదాపు రెండేళ్ళ నాటి ప్లాన్. చంద్రబాబు ధోరణి చూస్తుంటే రాజధాని నిర్మాణంపై అందరిలోనూ నమ్మకం పోతోంది. రైతులు కూడా ‘‘భూములు ఎందుకిచ్చామురా దేవుడా’’ అని తలలు బాదుకుంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ డిజైన్ల పేరుతోనే కాలయాపన చేయాలన్నది చంద్రబాబు ప్లాన్ అని అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయ్. అందుకే భూములిచ్చిన రైతులు కూడా తమ భూములను వెనక్కిచేయాలంటూ గోల పెడుతున్నారు. ఇటువంటి సమయంలో ‘డైవర్షన్ స్కీం’ క్రింద ‘‘సింగపూర్ కు రాజధాని రైతులు’’ అనే కొత్త డ్రామాకు తెరలేపారు. మరి ఎంతమంది రైతులు ముందుకొస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu