ఆనందయ్య మందు: 500 మంది నుండి డేటా సేకరించనున్న ఆయుర్వేద సంస్థ

Published : May 24, 2021, 04:38 PM IST
ఆనందయ్య మందు: 500 మంది నుండి డేటా సేకరించనున్న ఆయుర్వేద సంస్థ

సారాంశం

ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న వారి నుండి జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సమాచారాన్ని సేకరించనుంది. తొలి విడతలో ఈ మందును తీసుకొన్న 500 మంది వివరాలను అధికారులు సేకరించారు.


నెల్లూరు: ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న వారి నుండి జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సమాచారాన్ని సేకరించనుంది. తొలి విడతలో ఈ మందును తీసుకొన్న 500 మంది వివరాలను అధికారులు సేకరించారు.కరోనాతో ఇబ్బందిపడుతున్న 500 మంది ఆనందయ్య  మందు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. అంతకుముందు ఏ రకంగా ఉన్నారనే విషయమై సీపీఆర్‌ఏఎస్ బృందం పరిశీలించనుంది. ఆన్‌లైన్ ప్రొఫార్మాలో ఈ వివరాలను సేకరించనున్నారు. వీరి మెడికల్ రిపోర్టులపై కూడ ఆరా తీయనున్నారు. 

also read:ఆనందయ్య మందు:సీఎంఓ అధికారులతో ఆయుష్ కమిషనర్ భేటీ

ఈ విషయమై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుపతి ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రతినిధులు  ఈ వివరాలను సేకరించనున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆదేశించింది. ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ప్రకటించారు. ఇవాళ ఆయన సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఈ మందు గురించి జాతీయ పరిశోధన సంస్థ పరిశీలిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu