ఆనందయ్య మందు:సీఎంఓ అధికారులతో ఆయుష్ కమిషనర్ భేటీ

Published : May 24, 2021, 03:13 PM IST
ఆనందయ్య మందు:సీఎంఓ అధికారులతో ఆయుష్ కమిషనర్ భేటీ

సారాంశం

క్షేత్రస్థాయిలో ప్రజల నుండి తాను సేకరించిన సమాచారాన్ని ఆయుష్ కమిషనర్ రాములు  సీఎంఓ అధికారులకు వివరించారు. 

అమరావతి: క్షేత్రస్థాయిలో ప్రజల నుండి తాను సేకరించిన సమాచారాన్ని ఆయుష్ కమిషనర్ రాములు  సీఎంఓ అధికారులకు వివరించారు. ఆయుష్ కమిషనర్ రాములు సోమవారం నాడు అమరావతిలో ఏపీ సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందును ఆయుష్ కమిషనర్ ఆనందయ్య తన బృందంతో కలిసి  ఇటీవల పరిశీలించారు. ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని  కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఆనందయ్య మందుపై ఆయుష్ కమిసనర్ రాములు ఇంకా ప్రభుత్వానికి నివేదికను సమర్పించలేదు. ఈ మందు తయారీని పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ ను కోరింది. అయితే ఐసీఎంఆర్ నుండి ఇంతవరకు బృందం రాలేదు. 

also read:ఆనందయ్య కరోనా మందు: ఐసిఎంఆర్ టోకరా, రంగంలోకి సిసిఏఆర్ఎస్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్  ప్రతినిధులు ఇవాళ ఆనందయ్య తయారు చేసే మందును పరిశీలిస్తున్నారు. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న వారిని కూడ వైద్య నిపుణులు పరిశీలించే అవకాశం ఉంది.  ఈ మందును తీసుకొన్నవారిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా కరోనా విషయంలో ఈ మందు ఏ మేరకు పనిచేసిందనే విషయమై ఆరా తీయనున్నారు. ఈ విషయమై ఇంకా  ఐసీఎంఆర్ నుండి ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో  ఆనందయ్య మందు విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!