వైసీపీలో జగన్ సామాజికవర్గానికే పెద్దపీట: సీపీఐ రామకృష్ణ

By Nagaraju penumalaFirst Published Feb 18, 2019, 3:37 PM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏపీలోని13 జిల్లాల్లో అత్యధిక శాతం సమన్వయకర్తలు వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని వారిదే పెత్తనం అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీలో బీసీల ప్రాతినిథ్యం ఎక్కడ ఉందంటూ రామకృష్ణ ప్రశ్నించారు. 

విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 

విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన  చంద్రబాబు, జగన్ లు వలసలను ప్రోత్సహిస్తున్నా కనీసం పార్టీ మారేవారికైనా బుద్ది ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. 

నాలుగున్నరేళ్లు కార్పొరేట్‌లకు ఊడిగం చేసి ఎన్నికల సమయంలో రైతులపై ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీల జపం చేస్తున్నాయంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!