పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరండి: స్వరూపనందపై యామిని ఫైర్

Published : Feb 18, 2019, 03:22 PM ISTUpdated : Feb 18, 2019, 03:24 PM IST
పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరండి: స్వరూపనందపై యామిని ఫైర్

సారాంశం

ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు. 

అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పీఠాధిపతిగా ఉంటూ రాజకీయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

రాజకీయాలు చెయ్యాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరాలంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానందస్వామి అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం