వైసీపీలో చేరిన వారు త్వరలోనే తప్పు చేశామని బాధపడతారు: వర్ల రామయ్య

Published : Feb 18, 2019, 03:11 PM IST
వైసీపీలో చేరిన వారు త్వరలోనే తప్పు చేశామని బాధపడతారు: వర్ల రామయ్య

సారాంశం

మరోవైపు ఏపీ ప్రజలపై జగన్ కక్షగట్టారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ కు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అటు పార్టీ ఫిరాయింపులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వారు స్వప్రయోజనాల కోసమే ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బీసీ గర్జన సభపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. బీసీ గర్జన సభ వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు లేదన్నారు. 

టీఆర్ఎస్ తో కలిసి పెట్టినట్లు ఉందని ఆరోపించారు. జగన్ సభకు టీఆర్ఎస్ నేతలు బస్సుల్లో జనాల్ని తరలించారని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ కు సీఎం కుర్చీ కావాలి కానీ ఏపీ బస్సులు అవసరం లేదా అంటూ నిలదీశారు. మరోవైపు ఏపీ ప్రజలపై జగన్ కక్షగట్టారని విమర్శించారు.

ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ కు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అటు పార్టీ ఫిరాయింపులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వారు స్వప్రయోజనాల కోసమే ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన టీడీపీ నేతలు త్వరలోనే తమ తప్పులు తెలుసుకుంటారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu