జేసీ వ్యాఖ్యలపై సీపీఐ పోరాటం: అనంతపురం లోక్ సభ ఫలితాలు నిలిపివేయాలంటూ లేఖ

By Nagaraju penumalaFirst Published May 4, 2019, 3:31 PM IST
Highlights

జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి పోరాటబాట పట్టారు. శనివారం ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికీ లేఖ రాశారు. అనంతపురం లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిలిపివెయ్యాలంటూ లేఖలో కోరారు. 

అమరావతి: అనంతపురం లోక్ సభ నియోజకవర్గానికి తన తనయుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసినందుకు తనకు రూ.50 కోట్లు వరకు ఖర్చు అయ్యిందంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ పార్టీ పోరాటబాట పట్టింది. 

జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి పోరాటబాట పట్టారు. శనివారం ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికీ లేఖ రాశారు. అనంతపురం లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిలిపివెయ్యాలంటూ లేఖలో కోరారు. 

అలాగే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు పవన్‌ పోటీ చేస్తే రూ.50 కోట్లు ఖర్చయిందని, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చామంటూ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చెయ్యలేదని లేఖలో తెలిపారు.

 ఈసీ, గుంటూరు, అనంతపురం జిల్లా కలెక్టర్లు ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే శుక్రవారం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఈసీ కేసు నమోదు చేసింది. జేసీ వ్యాఖ్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. 

click me!