ఏపీలో ఆ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చెయ్యాలి

By Nagaraju penumalaFirst Published Apr 22, 2019, 9:03 PM IST
Highlights

కోట్లాది రూపాయలు అనైతికంగా వెదజల్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలాంటి వారు డబ్బు కోసం రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. జేసీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

అమరావతి: అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాలలో తన కుమారుల కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టించినట్లు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు.

జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని కోరుతూ సిఈవోను కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి ఓటుకు రూ.2వేలు పంచామని స్వయంగా ఆయనే చెప్పారని గుర్తు చేశారు. 

కోట్లాది రూపాయలు అనైతికంగా వెదజల్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలాంటి వారు డబ్బు కోసం రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. 

జేసీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం, తాడిపత్రి ఎన్నికను రద్దు చేయాలని సిఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. 

click me!