వైఎస్ జగన్ చేతకాని దద్దమ్మ...  అందుకే ప్రధాని అలా చేసారు..: సిపిఐ రామకృష్ణ

By Arun Kumar P  |  First Published Nov 10, 2023, 1:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ రామకృష్ణ తప్పుబట్టారు. 


అమరావతి : కృష్ణా నది జలాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేస్తున్నారని సిపిఐ నేత రామకృష్ణ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో లభ్ది పొందేందుకు కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని... ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా విడుదల చేసారని తెలిపారు. మన సీఎం వైఎస్ జగన్ ఏమీ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఏపికి పదేపదే అన్యాయం జరుగుతోందని రామకృష్ణ మండిపడ్డారు. 

క‌ృష్ణా జలాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే కీలక  నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కు కొత్త విధివిధానాలు ప్రతిపాదించింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం 1956 ప్రకారం ట్రైబ్యునల్‌కు రెండు విధివిధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ పై సిపిఐ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేసారు. 

Latest Videos

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కరువు పరిస్థితులు వున్నాయని వివిధ జిల్లాల్లో పర్యటించిన తమ ప్రతినిధులు గుర్తిచారని రామకృష్ణ తెలిపారు. 18జిల్లాల్లో అయితే తీవ్రమైన కరవు నెలకొందని అన్నారు. చివరకు పంటలు వేయలేని దుస్థితితో అన్నదాతలు వున్నారని... 440మండలాల్లో దుర్భరమైన పరిస్థితి ఉందన్నారు. 
రాష్ట్ర విభజన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదని  రామకృష్ణ అన్నారు. 

Read More  లారీని ఢీకొట్టిన మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం... ఘటనాస్థలికి చేరుకున్న దేవినేని ఉమ

నీటి ప్రాజెక్టుల్లో నీరు లేదు... దీంతో ఆయకట్టు ప్రాంతాల్లోనూ పంటలు వేయడంలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు 
కరువు గురించే మాట్లాడడు... అధికారులతో సమీక్షలు కూడా చేయడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నాడు...  రెవెన్యూ మంత్రి ఏమయ్యాడు... కరవు ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు పర్యటించరని రామకృష్ణ ప్రశ్నించారు.

ప్రభుత్వ అధికారులంతా‌ 'వై ఎపి‌నీడ్స్ జగన్' కార్యక్రమంలో బిజీగా ఉన్నారని... ఇక కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకునేది ఎవరని అన్నారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను, రైతులను పట్టించుకోని  జగన్ వద్దని అందరూ డిసైడ్ అయ్యారని సిపిఐ రామకృష్ణ తెలిపారు.
 

click me!