వైఎస్ వివేకా హత్య కేసు:వేరే రాష్ట్రంలో విచారణపై ఈ నెల 21న నిర్ణయమన్న సుప్రీం

By narsimha lode  |  First Published Oct 19, 2022, 12:12 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ను వేరే  రాష్ట్రంలో  విచారణ చేయాలని  దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ  నిర్వహించింది.రెండు రోజుల తర్వాత  సమగ్ర తీర్పును వెల్లడించనున్నట్టుగా ఉన్నత  న్యాయస్థానం  తెలిపింది.


న్యూఢిల్లీ: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించాలనే పిటిషన్  పై సుమారు రెండుగంటలపాటు బుధవారంనాడు సుప్రీకోర్టు ధర్మాసనం  విచారణ నిర్వహించింది.వేరే రాష్ట్రంలో విచారణ విషయమై  శుక్రవారం నాడు సమగ్రంగా తీర్పును వెల్లడించనున్నట్టుగా కోర్టు  తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఏబీఎన్  కథనం  ప్రసారం చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే  రాష్ట్రంలో విచారించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ  ఈ ఏడాది ఆగస్టు 12న  వైఎస్  సునీతా రెడ్డి  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు .ఈ  విచారణ  సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా  తమిళనాడు,కర్ణాటక రాష్ట్రంలో  విచారణ  నిర్వహించాలని ఆమె  ఆ  పిటిషన్ లో కోరింది.

Latest Videos

undefined

ఈ పిటిషన్  పై  విచారణకు  స్వీకరించిన సుప్రీంకోర్టు గతంలోనే  సీబీఐ,ఏపీ  ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన  విషయం  తెలిసిందే . ఇవాళ సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు  జారీ  చేసింది.వేరే రాష్ట్రంలో కేసు విచారణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఏ రాష్ట్రంలో విచారణను కోరుకుంటున్నారని  సుప్రీంకోర్టు   ఈ కేసులో నిందితులుగా  ఉన్న ఉమా శంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.మరో వైపు  తెలంగాణ రాష్ట్రంలో  ఈ  కేసు విచారణకు సునీతా   రెడ్డి తరపు  న్యాయవాది అంగీకరించారు.కానీ  సీబీఐ తరపు న్యాయవాది మాత్రం తెలంగాణలో  ఈ కేసు విచారణకు అంగీకరించలేదు.కర్ణాటక రాష్ట్రంలో విచారణకు  సానుకూలంగా స్పందించారు. ఏ రాష్ట్రంలో విచారణ నిర్వహించాలనే విషయమై  రెండు మూడు రోజుల్లో ఆదేశాలు  జారీ  చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ కేసు విచారణకు ఏపీ  ప్రభుత్వం  సహకరించడం లేదని కూడా  పిటిషనర్  సునీతా  రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య  విచారణను ఎప్పటిలోపుగా పూర్తి చేస్తారని సీబీఐ చెప్పకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం  చేసింది.  ఈ కేసులో సాక్షుల ప్రాణాలకు   ముప్పుందనే విషయాన్ని పిటిషనర్  తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు..ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఇద్దరు మరణించిన  విషయాన్ని పిటిషనర్ సుప్రీంకోర్టుకు చెప్పారు. 

ఢిల్లీలో ఈ కేసు విచారణ నిర్వహించాలని సునీతా రెడ్డి తరపు న్యాయవాది  సిద్దార్ధ్ లూథ్రా  సుప్రీంకోర్టును అభ్యర్ధించారు.మరోవైపు  ఈ  కేసులో  ఉమాశంకర్ రెడ్డి,గంగిరెడ్డిల వాదనలను కూడా వినేందుకు ఉన్నత  న్యాయస్థానం అంగీకరించింది.

also read: వేరే రాష్ట్రంలో విచారణ చేయాలి: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్

వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి  సుప్రీంకోర్టులో  సీబీఐ దాఖలు చేసిన కౌంటర్  ను కూడ సునీతా  రెడ్డి లాయర్   కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు..సీబీఐ అధికారుల పనికి నిందితులు  ఆటంకం  కల్గిస్తున్నవిషయాన్ని సునీతారెడ్డి సిద్దార్ద్ లూద్రా కోర్టు దృష్టికి  తీసుకువచ్చారు. ఈ కేసులో  రాష్ట్ర  ప్రభుత్వం  రాజకీయ పరంగా  జోక్యం  చేసుకుంటుందని  కూడ  సిద్దార్ద్ చెప్పారు.ఇద్దరు సాక్షులు మరణించిన విషయాన్ని  కూడా  ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారని ఎబీఎన్  కథనం  తెలిపింది.

సిబీఐకి అఫ్రూవర్  గా మారిన దస్తగిరిని   నిందితుల తరపున వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని సునీతారెడ్డి  న్యాయవాది  చెప్పారు .మరో వైపు స్థానిక పోలీసులు  కూడా సహకరించడం లేదని  సీబీఐ  ఇచ్చిన నివేదికను సిద్దార్ధ్ లూద్రా వివరించారు.సునీతారెడ్డి పిటిషన్ తో సుప్రీంకోర్టు ధర్మాసనం  ఏకీభవించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఈ కేసు  విచారణ కు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.

click me!