లాక్ డౌన్ ఎఫెక్ట్... వలన కూలీల కోసం నేడే హెకోర్టు విచారణ

By Arun Kumar P  |  First Published Apr 23, 2020, 10:41 AM IST

లాక్ డౌన్ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకోవాలంటూ సిపిఐ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. 


అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో నిరుపేద, వలస కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారిని  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే కాదు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. వారి సమస్యలను ఏపి హైకోర్టు దృష్టికి తీసుకెళుతూ ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇప్పటికే గుంటూరులో ఇద్దరు, గుజరాత్ లో ఒకరు చనిపోయారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి తన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని రామకృష్ణ కోరారు. దీంతో అత్యవసర కేసుగా పరిగణించి ఈ రోజు(గురువారం) విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకంతకూ కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. నిన్న(బుధవారం) కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 56 పెరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 24కు చేరుకుంది.

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఈ జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 177కు చేరుకుంది. దాంతో కరోనా వైరస్ కేసులు నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా 203 కేసులతో అగ్రస్థానంలో సాగుతోంది.

 కొత్తగా ఆరు జిల్లాల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. చిత్తూరు జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో 19, కడప జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో నాలుగు కేసులు కొత్తగా నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 120 మంది డిశ్చార్జ్ అయ్యారు.  669 రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏ విధమైన కేసులు కూడా నమోదు కాలేదు.

click me!