కరోనా పరీక్షల్లో ఏపిదే మెదటి స్థానం... వైద్యారోగ్య శాఖ వెల్లడి

By Arun Kumar P  |  First Published Apr 22, 2020, 9:47 PM IST

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. 


అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకు అన్ని రాష్ట్రాలు విస్తృతంగా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విధంగా చేపడుతున్న పరీక్షల్లో ఏపిదే దటిస్థానమట. ఈ విషయాన్ని ఏపి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో పది లక్షల మందికి సగటున  830 మందికి టెస్టులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

దేశంలో ఇంత పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని అధికారులు తెలిపారు. ఇక ఈ రాజస్థాన్ లో పదిలక్షల మందికి సగటున 809 టెస్టులు చేయడం ద్వారా రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. 

Latest Videos

undefined

ఏపిలో ఇప్పటి వరకు 41,512 మందికి కరోనా టెస్టులు చేశారు. ఈనెల 21న ఒక్కరోజే 5,757 మందికి టెస్టులు చేశారు. ఇందులో ట్రూనాట్ ద్వారా 3082 శాంపిళ్లను టెస్ట్ చేశామని 
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నేటికీ ఈ సమాచారం ఐసిఎంఆర్ వెబ్ సైట్ లో అప్లోడ్ కాలేదని...అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ట్రూనాట్ టెస్టుల సమాచారాన్ని ఐసిఎంఆర్ కి పంపుతూనే ఉందన్నారు. 

 

click me!