విద్యుత్ మీటర్లు పెట్టి చూడు...ఏం జరుగుతుందో: జగన్ కు నారాయణ వార్నింగ్

By Arun Kumar PFirst Published Oct 1, 2020, 9:49 AM IST
Highlights

ఏపీ సీఎం జగన్ తగదునమ్మా అంటూ రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారని సిపిఐ నారాయణ మండిపడ్డారు. 

అనంతపురం: వ్యవసాయానికి ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న కరెంట్ ను ఇకపై నగదు బదిలీ రూపంలో అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడితో సహా వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలో వామపక్షాల ఆద్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

''విద్యుత్ మీటర్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్పలేదు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం తగదునమ్మా అంటూ రైతులకు నష్టం చేకూర్చేలా మీటర్లను బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు. తనను జైలుకు పంపకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని నారాయణ ఆరోపించారు.

''వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాన్న నిర్ణయాన్ని జగన్ వెనక్కితీసుకోవాలి. ఇప్పుడున్న పద్దతిలోనే రైతులకు ఉచిత కరెంట్ అందించాలి. అలా కాదని మీటర్లు బిగించాలని చూశారో... అప్పుడు ఏం జరుగుతుందో చూడండి'' అంటూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నారాయణ. 

ఇక కేంద్ర  ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులను తీవ్రంగా నష్టపోనున్నారు. వారు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిని కేంద్రం సృష్టిస్తోందన్నారు. అయినా సంసారం, పిల్లలు వుంటే ఆ రైతుల బాధేంటో ప్రధానికి తేలిసేది అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

click me!