నివేదికల కోసం వెయిట్ చేయొద్దు, పంపిణీ ఆపొద్దు: ఆనందయ్య మందుపై సీపీఐ నారాయణ

By Siva KodatiFirst Published May 23, 2021, 4:27 PM IST
Highlights

నెల్లూరులో ఆనందయ్యతో సమావేశమయ్యారు సీపీఐ నేత నారాయణ. మందు పంపిణీ వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. మందు వల్ల హానీ లేదని అన్నప్పుడు పంపిణీ ఆపడం ఎందుకని నారాయణ ప్రశ్నించారు. 

నెల్లూరులో ఆనందయ్యతో సమావేశమయ్యారు సీపీఐ నేత నారాయణ. మందు పంపిణీ వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. మందు వల్ల హానీ లేదని అన్నప్పుడు పంపిణీ ఆపడం ఎందుకని నారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు నివేదికలు ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని.. అప్పటి  వరకు మందు నిలిపివేత మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకన్నాక కోవిడ్‌తో చనిపోవడం లేదా అని ఆయన నిలదీశారు. 

ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు. మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.. ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాములు వెల్లడించారు.

Also Read:ఆనందయ్య మందుకు అనుమతిస్తే ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్దం: చెవిరెడ్డి

క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని.. కానీ కేంద్ర సాయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. మందు తయారీ విధానాన్ని బహిరంగ పర్చేందుకు ఆనందయ్య అంగీకరించారని.. ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్‌లో కూడా ఎలాంటి హానికారకాలు లేవని రాములు తెలిపారు.

తేనే, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐ డ్రాప్స్ తయారు చేస్తున్నారని రాములు చెప్పారు. ఐ డ్రాప్స్ వల్ల ఇబ్బందులు వుండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్థారించిందని తెలిపారు. ఆనందయ్య వాడుతున్న వివిధ పదార్ధాల మిశ్రమంతో ఎలాంటి ఎఫెక్ట్ వుండదని ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారణ అయ్యిందన్నారు. ఆనందయ్య ఎవరెవరికి మందులిచ్చారో డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నామని.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ స్టడీస్‌కు ఈ డేటా అందిస్తామని ఆయుష్ కమీషనర్ స్పష్టం చేశారు. ఆ బృందం దీనిపై అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. 

click me!