కరోనా కట్టడిలో మేము సైతం... విశాఖలో వ్యాక్సినేషన్ గణేషుడు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 10, 2021, 2:07 PM IST
Highlights

కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు విశాఖ యువకులు వినాయక చవితి పండగను వినూత్నంగా జరుపుతున్నారు. 

విశాఖపట్నం: వినాయకచవితి వచ్చిందంటే చాలు గ్రామాలు. పట్టణాల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. ముఖ్యంగా యువత గల్లీల్లో మండపాలు ఏర్పాటుచేసి విఘ్నరాజును పూజించేందుకు మక్కువ చూపిస్తుంటారు. ఇలా తమ మండపాలను అందంగా ముస్తాబు చేయడమే కాదు తమ వినాయకుడు డిఫరెంట్ గా, అందరినీ ఆకర్షించేలా వుండాలని యువకులు చూస్తుంటారు. ఇలాంటి ఆలోచన నుండి వచ్చిందే వ్యాక్సినేషన్ గణేష. 

విశాఖపట్నం తాటిచెట్లపాలెంలోని లెప్పర్సీ కాలనీకి చెందిన యువకులు ప్రతి ఏడాది వినూత్నంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పండుగ అంటే వినోదాలూ... ఆధ్యాత్మిక సంబరాలు మాత్రమే కాదని గ్రహించిన యువకులు సమాజానికి ఏదయినా మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా రాష్ట్రాన్నే కాదు దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యాక్రమానికి ప్రచారం కల్పిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచాలని భావించారు. అందులో భాగంగానే తమ కాలనీలో వ్యాక్సినేషన్ గణేషున్ని ప్రతిష్టించారు. 

వీడియో

యువసేన ఫౌండేషన్ సభ్యుడు హరిప్రసాద్ మాట్లాడుతూ... మంచిని పదిమందీ కలసీ పంచుకునే అవకాశం కల్పించాలన్నది యువసేవ సంకల్పం. ఆ దిశలో గత ఏడేళ్లుగా వినాయుని వేడుకలను సమాజానికి సందేశాన్నిచ్చే విధంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇందులో గతంలో టీవీలో వినాయకుడు, ఏటీఎంలో వినాయకుడు, ప్రకృతి వినాయకుడు ఏర్పాటుచేశామని... ఈ సారి వ్యాక్సినేషన్ గణేషున్ని ప్రతిష్టించినట్లు తెలిపారు.  

ఈ సంవత్సరం వాక్సిన్ వినాయకుడు కాన్సెప్ట్ తో బొజ్జ గణపయ్యని భక్తుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు. వాక్సిన్ యొక్క ఉపయోగాలు, దాన్ని ప్రముఖ్యతన్ని తెలియజేయడమే తాము ఏర్పాటుచేసిన వినాయకుని ప్రత్యేకత అని హరిప్రసాద్ తెలిపాడు. 

click me!