నేటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ షురూ.. ముందుగా ఆ వయసు వారికి..

Published : Mar 01, 2021, 10:17 AM ISTUpdated : Mar 01, 2021, 11:56 AM IST
నేటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ షురూ.. ముందుగా ఆ వయసు వారికి..

సారాంశం

నేటినుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రధానంగా 60 యేళ్లు పైబడిన వారితో పాటు 45 యేళ్లకంటే ఎక్కువ వయస ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. 

నేటినుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రధానంగా 60 యేళ్లు పైబడిన వారితో పాటు 45 యేళ్లకంటే ఎక్కువ వయస ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. 

ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. తెలంగాన వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్ లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

కోవిడ్ టీకా తీసుకోవాలనుకునేవారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్ కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ టీకా తీసుకోవచ్చని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. 

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేసినా తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని అధికారులు తెలిపారు. అందరూ మొదటి రోజే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు తొందరపడవద్దని సూచించారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతొక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్ చైర్ లో ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేస్తారు. 

అటు ఏపీలోను వ్యాక్సినేషన్ స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు జిల్లాలో కరోనా భయం రోజురోజుకు పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో ప్రభుత్వం అప్పమత్తమైంది. ప్రజలు జాగ్రతలు పాటించాలని సూచిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండడం, పాఠశాలలు తెరుచుకోవడంతో అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. అన్ని స్కూల్స్ లో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నామని, భయపడాల్సిన పని లేదంటున్నారు విద్యాశాఖాధికారులు. 

కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ వంటి కొవిడ్ నియంత్రణ రూల్స్ ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని హితవు పలికింది.
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu