ఫిరాయంపు మంత్రి వియ్యంకుడికి ఏడాది జైలు

First Published Jun 30, 2017, 9:10 AM IST
Highlights

వియ్యంకుడిని రక్షించుకోవటం కోసమే వైసీపీ ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించారని పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. అధిక వడ్డీని ఆశగా చూపించి రెడ్డి విద్యార్ధుల తల్లి,దండ్రుల నుండి సుమారు రూ. 700 కోట్ల డిపాజిట్లు సేకరిచారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే కదా?

కేశవరెడ్డి విద్యా సంస్ధల అధినేత కేశవరెడ్డికి కోర్టు ఏడాది జైలుశిక్ష పడింది. రెడ్డి కేవలం విద్యాసంస్ధల అధినేతే కాదు ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి స్వయంగా వియ్యంకుడు కూడా. విద్యార్ధుల తల్లి, దండ్రుల నుండి వందల కోట్లు డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించలేదనేది కేశవరెడ్డిపై అభియోగాలు. తల్లి, దండ్రులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేశవరెడ్డిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే, ఓ చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న అదినేతకు కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.

గతంలో కేశవరెడ్డి బాలయ్య అనే వ్యక్తినుండి రూ. 25 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు చెల్లింపులో భాగంగా చెక్ ఇచ్చారు. అయితే ఖాతాలో తగినంత నిధులు లేనికారణంగా కేశవరెడ్డి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దాంతో బాలయ్య కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు కేశవరెడ్డికి ఏడాది జైలుశిక్ష విధించింది. అంతకుముందే డిపాజిట్లను ఎగవేసిన కేసుల్లోనూ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు.

వియ్యంకుడిని రక్షించుకోవటం కోసమే వైసీపీ ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించారని పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. అధిక వడ్డీని ఆశగా చూపించి రెడ్డి విద్యార్ధుల తల్లి,దండ్రుల నుండి సుమారు రూ. 700 కోట్ల డిపాజిట్లు సేకరిచారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే కదా? పార్టీ ఫిరాయించిన ఆదికి మంత్రిపదవి దక్కింది కానీ వియ్యంకుడికి మాత్రం జైలుశిక్ష పడింది.

 

click me!