పులివెందుల కాల్పుల కేసు: భరత్ కుమార్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్

Published : Mar 30, 2023, 04:15 PM ISTUpdated : Mar 30, 2023, 04:32 PM IST
పులివెందుల కాల్పుల కేసు: భరత్ కుమార్ యాదవ్  కు 14 రోజుల రిమాండ్

సారాంశం

కడప జిల్లాలోని  పులివెందులలో  రెండు రోజుల క్రితం  జరిగిన  కాల్పులకు  దిగిన  భరత్ కుమార్ యాదవ్ కు  కోర్టు  14 రోజుల రిమాండ్  విధించింది. 

కడప:  జిల్లాలోని పులివెందులలో  రెండు  రోజుల క్రితం  తుపాకీతో కాల్పులకు దిగి  దిలీప్ అనే వ్యక్తి  మృతికి కారణమైన భరత్ కుమార్ యాదవ్ కు  కోర్టు  రిమాండ్  విధించింది.  గురువారంనాడు   భరత్ కుమార్ యాదవ్ ను  పోలీసులు కోర్టులో హాజరపర్చారు.  ఈ కేసులో  భరత్ కుమార్ యాదవ్ కు  మేజిస్ట్రేట్  14 రోజుల రిమాండ్  విధిస్తూ  ఆదేశించారు. దీంతో  పోలీసులు భరత్ కుమార్ యాదవ్ ను  కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 

పులివెందుల  బీఎస్‌ఎన్ఎల్ కార్యాలయం వద్ద  రెండు  రోజుల క్రితం  భరత్ కుమార్ యాదవ్  ఇద్దరిపై  తన వద్ద  ఉన్న తుపాకీతో  కాల్పులకు దిగాడు.ఈ కాల్పుల ఘటనలో  తీవ్రంగా గాయపడిన  దిలీప్ కడపకు తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు.  ఈ ఘటనలో  గాయపడిన  మస్తాన్ భాషా   ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు.  

భరత్ కుమార్ యాదవ్ వద్ద  దిలీప్ అప్పు తీసుకున్నాడు .  ఈ విషయమై  దిలీప్, భరత్ కుమార్ మధ్య  వాగ్వాదం జరిగింది.  మాటా మాటా పెరిగింది.  కోపంతో  భరత్ కుమార్ తన లైసెన్స్ తుపాకీతో  కాల్పులకు దిగాడు.  దిలీప్,  మస్తాన్ భాషాలపై  నాలుగు రౌండ్లు కాల్పులకు దిగాడు . ఈ ఘటనలో పులివెందుల ఆసుపత్రిలో  దిలీప్,  మస్తాన్, భాషాలకు  ప్రాథమిక  చికిత్స  నిర్వహించారు. కడపకు  తరలిస్తున్న సమయంలో  దిలీప్ మృతి చెందాడు.  ఈ ఘటనలో  గాయపడిన  మస్తాన్ భాషా చిత్తూరులో చికిత్స పొందుతున్నాడు.

దిలీప్,  భాషాలపై  కాల్పులకు దిగిన తర్వాత భరత్ కుమార్ యాదవ్  పోలీసులకు  లొంగిపోయాడు. ఈ విషయమై పోలీసులు భరత్ కుమార్ ను  విచారించారు. ఇవాళ కోర్టులో   భరత్ కుమార్ ను హాజరుపర్చారు.  నడిరోడ్డుపై  దిలీప్ పై  భరత్ కుమార్ యాదవ్  కాల్పులకు దిగిన  ఘటన  సీసీటీవీ పుటేజీల్లో  రికార్డయ్యాయి.  తుపాకీ కాల్పుల నుండి తప్పించుకొని   దిలీప్  పారిపోతున్న సమయంలో  వెంబడించి భరత్ కుమార్ అతనిపై  కాల్పులకు దిగాడు.   

also read:మాట్లాడుదామని పిలిచి కాల్చి చంపాడు: భరత్ పై దిలీప్ సోదరుడి ఆరోపణలు

  భరత్ కుమార్  అప్పును చెల్లించినట్టుగా  దిలీప్  భార్య  చెబుతున్నారు.  వడ్డీ డబ్బులు మాత్రమే చెల్లించాల్సి ఉందని   ఆమె  చెప్పారు. రూ. 50 వేలు  చెల్లించాల్సి ఉందని  ఆమె మీడియాకు వివరించారు.  ఈ డబ్బుల కోసమే దిలీప్ ను  భరత్ కుమార్  హత్య చేశారని  ఆమె  రెండు  రోజుల క్రితం  మీడియాతో  విలపిస్తూ  చెప్పిన విషయం తెలిసిందే.  భరత్ కుమార్  అప్పును చెల్లించినట్టుగా  దిలీప్  భార్య  చెబుతున్నారు.  వడ్డీ డబ్బులు మాత్రమే చెల్లించాల్సి ఉందని   ఆమె  చెప్పారు. రూ. 50 వేలు  చెల్లించాల్సి ఉందని  ఆమె మీడియాకు వివరించారు.  ఈ డబ్బుల కోసమే దిలీప్ ను  భరత్ కుమార్  హత్య చేశారని  ఆమె  రెండు  రోజుల క్రితం  మీడియాతో  విలపిస్తూ  చెప్పిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు