ఆస్తి కోసం బంధువులు నన్ను చంపాలని చూస్తున్నారు : హెచ్‌ఆర్సీకి 9వ తరగతి విద్యార్ధి ఫిర్యాదు

Siva Kodati |  
Published : Mar 30, 2023, 03:28 PM IST
ఆస్తి కోసం బంధువులు నన్ను చంపాలని చూస్తున్నారు : హెచ్‌ఆర్సీకి 9వ తరగతి విద్యార్ధి ఫిర్యాదు

సారాంశం

తనను బంధువులు చంపాలని చూస్తున్నారంటూ 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది

తనను బంధువులు చంపాలని చూస్తున్నారంటూ 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. డేవిడ్ అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు ఏపీ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం తనను చంపడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని .. తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరాడు.

తన తల్లి చనిపోయిందని.. తల్లి నుంచి తనకు వచ్చిన ఆస్తిని మేనమామ భార్య, అతని కుటుంబ సభ్యులు కాజేయడానికి చూస్తున్నారని బాలుడు ఆరోపించాడు. తనతో వెట్టిచాకిరీ చేయిస్తూ అన్నం కూడా సరిగా పెట్టకుండా వేధించేవారని, హాస్టల్‌లో వుండి చదువుకుంటున్నానని చెప్పాడు. భవిష్యత్‌లో తన జోలికి వాళ్లు  రాకుండా చూడాలని కోరాడు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కానీ నాటి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు