డోన్‌లో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ: ఐదుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 30, 2023, 3:17 PM IST
Highlights

నంద్యాల జిల్లాలోని డోన్ మండలం మల్లెంపల్లి లో  టీడీపీ, వైసీపీ వర్గీయుల  మధ్య ఘర్షణ  చోటు  చేసుకుంది. 

నంద్యాల: జిల్లాలోని  డోన్ మండలం  మల్లెంపల్లిలో  టీడీపీ, వైసీపీ  వర్గీయుల మధ్య  గురువారంనాడు  ఘర్షణ చోటు  చేసుకుంది.   ఈ ఘటనలో  ముగ్గురు పోలీసులు సహా  ఐదుగురు గాయపడ్డారు. మల్లెంపల్లిలో ట్రాక్టర్ డ్రైవర్ పై  వైసీపీ  నేత  సుధీర్  దాడి  చేశాడని  టీడీపీ వర్గీయులు  ఆరోపిస్తున్నారు.ఈ విషయమై  ప్రశ్నిస్తే   ఇతరులపై కూడా దాడికి దిగినట్టుగా  బాధితులు  ఆరోపిస్తున్నారు.  చిన్న ఘటన రెండు  పార్టీల మధ్య  ఘర్షణకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ  వర్గీయులు పరస్పరం ఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణ  విషయం తెలుసుకున్న  పోలీసులు  గ్రామానికి  చేరకుున్నారు. పోలీసుల సమక్షంలోనే  ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.ఈ  ఘర్షణలో  ముగ్గురు పోలీసులు సహా  ఐదుగురు గాయపడ్డారు. 

రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల  మధ్య  ఘర్షణలు  చోటు  చేసుకుంటున్నాయి. ఈ నెల  6వ తేదీన  అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ లో  టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు.  సోషల్ మీడియాలో పోస్టింగ్ ల అంశం  ఇరు వర్గాల మధ్యఘర్షణకు కారణమైంది. 

ఈ నెల  13న  ఎమ్మెల్సీ పోలింగ్  కేంద్రం వద్ద  వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఎమ్మెల్సీ  ఎన్నికలను పురస్కరించుకొని  ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది.  ఇరువర్గాల దాడిలో టీడీపీ నేత కృష్ణయాదవ్  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. 

2022 డిసెంబర్ 16న మాచర్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల  మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది.  పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.  జూలకంటి బ్రహ్మారెడ్డి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య  ఘర్షణ  చోటు  చేసుకుంది.  2022 డిసెంబర్  26న  గుడివాడలో  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య  ఘర్షణ  చోటు  చేసుకుంది . వంగవీటి రంగా  వర్ధంతి  కార్యక్రమం విషయమై  ఇరు వర్గాల మధ్య  ఘర్షణకు దారి తీసింది

 

tags
click me!