టిడిపి నేతలకు జైలుశిక్ష

First Published Jan 11, 2018, 7:19 AM IST
Highlights

తెలుగుదేశంపార్టీ నేతలకు కోర్టు 6 మాసాల జైలుశిక్ష విధించింది.  

తెలుగుదేశంపార్టీ నేతలకు కోర్టు 6 మాసాల జైలుశిక్ష విధించింది.  రెవిన్యూ కార్యాలయంలో అధికారులపై దాడికి పాల్పడి, రికార్డులను చించేసిన ఓ ఘటనలో కోర్టు టిడిపి నేతలకు జైలుశిక్ష వేసింది. ఇంతకీ ఏమి జరిగిందంటే, గుంటూరు జిల్లా అమృతలూరులో రెండేళ్ళ క్రితం తహసీల్డార్ కార్యాలయానికి కూచిపూడి గ్రామ సర్పంచ్ యలవర్తి బ్రహ్మానందం తన అనుచరులతో వెళ్ళారు. దీపం గ్యాస్ కనెక్షన్ల విషయంలో అధికారులకు, బ్రాహ్మానందానికి మధ్య గొడవ జరిగింది.

గొడవను సర్దుబాటు చేసేందుకు ఎంఆర్ఓ గోపాలకృష్ణ ప్రయత్నించారు. అయితే, నేతలు వినకుండా ఆయనపై దాడి చేశారు. అంతేకాకుండా రికార్డులను కూడా చించేశారు. దాంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫిర్యాదును దర్యాపు చేసిన పోలీసులు కేసును కోర్టు ముందుంచారు. మొత్తం కేసును విచారించిన కోర్టు బ్రహ్మానందం, శ్రీనివాసరావులకు 6 మాసాల జైలుశిక్ష విధించటంతో పాటు రూ. 2 వేల ఫైన్ కూడా వేశారు.

click me!