వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్ పొడిగించిన కోర్టు..

Published : Apr 29, 2023, 03:43 PM IST
వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్ పొడిగించిన కోర్టు..

సారాంశం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కోర్టు పొడిగించింది. 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కోర్టు పొడిగించింది. భాస్కర్ రెడ్డికి గతంలో కోర్టు విధించిన జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో భాస్కర్ రెడ్డిని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డికి మే 10వ తేదీ వరకు జ్యూడిషయల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. దీంతో భాస్కర్ రెడ్డిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

ఇక, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ నెల 14న ఉదయ్ కుమార్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 16న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను ఏప్రిల్ 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు విచారించేందుకు తెలంగాణ హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించారు. 

నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో వారి ఆరోపించిన పాత్ర గురించి సీబీఐ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల డీల్, నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్‌కు రూ. 1 కోటి చెల్లింపు అంశంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్టుగా  తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా కోర్టు మే 10 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu