వివేకా హత్యకేసు : ఎర్రగంగిరెడ్డికి కోర్టులో ఊరట.. సీబీఐకి ఎదురుదెబ్బ

Siva Kodati |  
Published : Dec 01, 2021, 12:04 PM IST
వివేకా హత్యకేసు : ఎర్రగంగిరెడ్డికి కోర్టులో ఊరట.. సీబీఐకి ఎదురుదెబ్బ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan  reddy) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి (erra gangi reddy) బెయిలు పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan  reddy) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి (erra gangi reddy) బెయిలు పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుచేత బెయిలు రద్దు చేయాలని కోరుతూ కడప కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్‌పై విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది కోర్ట్.

కాగా.. సీబీఐతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.తనకు CBIరూ. 10 కోట్లు కూడా ఆఫర్ చేసిందని Gangadhar Reddy  అనే వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Ys Vivekananda Reddy హత్య కేసులో YS Avinash Reddy, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపాలని ఒప్పుకోవాలని కూడా  బెదిరించారని  Anantapur SP   ఎస్పీకి వివరించారు.

Also Read:Ys Vivekananda Reddy Murder case: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ Pakkirappa స్పందించారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఆయనకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. సీబీఐతో పాటు వివేకానందరెడ్డి అనుచరులు, సీఐ శ్రీరాంపై గంగాధర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు.ఈ విషయమై డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని ఎస్పీ చెప్పారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్టుగా గంగాధర్ చెబుతున్నారని ఎస్పీ తెలిపారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామని ఎస్పీ వివరించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ  అధికారులు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని ఈ నెల 26న  కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో  ఈ ట్విస్ట్ చోటు చేసుకొంది. 2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే  దుండగులు హత్య చేశారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురిపై సీబీఐ అభియోగాలను మోపింది. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి తో పాటు సునీల్ యాదవ్ లపై సీబీఐ అభియోగాలు మోపింది.  పూర్తిస్థాయి చార్జీషీట్ ను కూడా త్వరలోనే దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్