28ఏళ్ల యువకుడితో హోటల్లో దిగిన 45ఏళ్ల మహిళ... గొంతు కోసిన స్థితిలో...

Published : Aug 06, 2021, 04:18 PM ISTUpdated : Aug 06, 2021, 04:23 PM IST
28ఏళ్ల యువకుడితో హోటల్లో దిగిన 45ఏళ్ల మహిళ... గొంతు కోసిన స్థితిలో...

సారాంశం

గుంటూరు జిల్లా బ్రాడీపేట‌లోని ఓ హోటల్ గదిలో దిగిన జంటను గొంతు కోయబడి రక్తపుమడుగులో పడిన స్థితిలో సిబ్బంది గుర్తించారు. 

అమరావతి: ఓ హోటల్ గదిలో దిగిన జంట గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బ్రాడీపేట‌లోని గోల్డెన్ పార్క్ హోటల్‌లో ఈ దారుణం జరిగింది. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. 

వివరాల్లోకి వెళితే... బండి విజయ సాగర్ బాబు( 28), మాడుగుల రహేలు(45 )లు అనే మహిళతో కలిసి బ్రాడిపేటలోని ఓ హోటల్లో దిగాడు. ఎమయ్యిందో తెలీదు గానీ వీరిద్దరూ హోటల్ గదిలోనే గొంతు కోయబడిన స్థితిలో కనిపించారు. గదిలోంచి అరుపులు వినిపించడంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లగా అప్పటికే ఇద్దరూ రక్తపు మడుగులో పడివున్నారు.

read more  విజయవాడ మహిళపై దాష్టికం... ఆటో డ్రైవర్ అరెస్ట్ (వీడియో)

దీంతో హోటల్ సిబ్బంది వీరిద్దరిని చికిత్స నిమిత్తం గుంటూరు హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈ ఘటన జరిగిన హోటల్ గదిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.  
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu