కూలీలే టార్గెట్... చిట్టీల పేరుతో రూ.8 కోట్లు టోకరా, రాత్రికి రాత్రే మాయమైన దంపతులు

Siva Kodati |  
Published : Apr 26, 2022, 09:31 PM IST
కూలీలే టార్గెట్... చిట్టీల పేరుతో రూ.8 కోట్లు టోకరా, రాత్రికి రాత్రే మాయమైన దంపతులు

సారాంశం

కూలీ పనులు చేసుకుంటూ ఆపదలో అక్కరకొస్తాయనే ఉద్దేశ్యంతో చిట్టీలు వేసిన నిరుపేదలను గుంటూరులో భార్యాభర్తలు నిండా ముంచారు. దాదాపు రూ.8 కోట్ల మేర మోసం చేసి.. రాత్రికి రాత్రి పారిపోయారు. 

గుంటూరులో (guntur) చిట్టిల పేరుతో కోట్ల రూపాయల మేర పంగనామం పెట్టారు ఘరానా మోసగాళ్లు. నగరం పాలెం (nagarampalem) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మోసాన్ని గ్రహించిన బాధితులు నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులంతా రామిరెడ్డి నగర్‌కి చెందిన వారిగా గుర్తించారు. కూలీ పనులు చేసుకునే వారినీ టార్గెట్ చేశారు ఘరానా మోసగాళ్ళు. పీరా అలియాస్ బాబు, అతని భార్య ఫాతిమా మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేసిన వారు ఇల్లు ఖాళీ చేసి పారిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ దాదాపు 8 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు అంచనా. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్