దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ షురూ.. నేటి అర్థరాత్రి కర్రల సమరం...

By SumaBala Bukka  |  First Published Oct 24, 2023, 8:01 AM IST

ఆంధ్రప్రదేశ్ లో దేవరగట్టులో  బన్నీ ఉత్సవం ఈ రోజు అర్థరాత్రి మొదలుకానుంది. కర్రలసమరానికి అంత సిద్ధమయ్యింది. 


కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగేదేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డైన్ మొదలయ్యింది. నేడు అర్థరాత్రి మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి అర్థరాత్రి పూట కర్రల సమరం జరగనుంది. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులను మొహరించారు. వందమంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 

కర్రల సమరంలో గాయపడ్డ భక్తులకు వెంటనే చికిత్స అందించడం కోసం తాత్కాలికంగా ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకోవడానికి తెల్లారేవరకు కర్రల సమరం జరుగుతుంది. మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు మూడు గ్రామాలు ఓ వైపు, ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి ఆరు గ్రామాలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు. 

Latest Videos

ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకోవడానికి ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకుంటారు. ప్రాణాలు పోతున్నా, శరీరాలు రక్తమోడుతున్నా లెక్క చేయరు. ఈ రోజు అర్థరాత్రి జరగనున్న ఈ వేడుకలో ఎంతమంది గాయపడతారో అనే విషయం టెన్షన్ అందర్లోనూ నెలకొంది. 

ఏపీలో నలుగురు పోలీసు అధికారులపై వేటు....

ఇదిలా ఉండగా, అయితే, 2020 బన్నీ ఉత్సవంపై పోలీసులు నిషేధం విధించారు. కానీ దీన్ని ఎవరూ పాటించలేదు. దీంతో యదావిధిగా హింసాత్మకంగా మారింది. మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి రెండు గ్రామాలకు చెందిన వేలాదిమంది కర్రలతో కొట్టుకుంటారు. కరోనా సమయంలో 2020లో కర్రల సమరాన్ని పోలీసులు నిషేదించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించారు. దేవరగట్టు ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు.

పూజలకు మూడు గ్రామాలకు చెందిన 50 మందిని మాత్రమే అనుమతించారు. హోలగుంద, ఆలూరు మండలాల్లో లాక్ డౌన్ విధించారు. 144వ సెక్షన్ అమలు చేశారు. దేవరగట్టుకు వెళ్లే మార్గాలన్నింటినీ మూసేసి, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను లోనికి అనుమతించలేదు. దాదాపు 1500 మంది పోలీసులు మోహరించారు. చుట్టపక్కల గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. అయినా ఎవ్వరూ ఈ నిషేధాన్ని లెక్కచేయలేదు. ఒక్కసారిగా వందలాదిమంది అక్కడికి చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. 
 

click me!