అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మూడు వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2944కు చేరుకుంది. మరణాలు 60కి చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 70 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటీలో మూడు కేసులు కోయంబేడుతో లింకులున్నవి.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2092 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 792గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న కేసుల్లో కోయంబేడు లింకులున్న కేసులు అధికంగా బయటపడుతున్నాయి.
ఇక తాజాగా ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయ ఉద్యోగులతో పాటు అతడితో పాటే హైదరాబాద్ నుండి ఏపికి వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు.
undefined
దీంతో గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారితో పాటు సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగి మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కోవిడ్ విభాగంకు తరలించేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. మంగళగిరి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై ఆ అపార్ట్ మెంట్ ప్రాంతంలో శానిటైజ్ చేస్తున్నారు.