ఏపీలో కరోనా కాటు: 14 వేలు దాటిన కేసులు, మొత్తం 187 మంది మృతి

By telugu team  |  First Published Jun 30, 2020, 12:33 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 187 మంది కరోనా వైరస్ తో మృత్యువాత పడ్డారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 704 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో స్థానికులు 648 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 51 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

తాజా కేసులతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 వేలు దాటింది. రాష్ట్రంలో మొత్తం 14,595 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. గుంటూరు, అంతపురం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధితో మరణించినవారి సంఖ్య 187కు చేరుకుంది.

Latest Videos

undefined

గత 24 గంటల్లో 18,114 శాంపిల్స్ ను పరీక్షించారు. గత 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7897 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

 

: 30/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,202 పాజిటివ్ కేసు లకు గాను
*5245 మంది డిశ్చార్జ్ కాగా
*187 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6770 pic.twitter.com/z0x7Z7SROt

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!