అగ్రస్థానంలో తూర్పు గోదావరి: ఏపీలో లక్షా 40 వేలు దాటిన కరోనా కేసులు

By telugu teamFirst Published Jul 31, 2020, 6:17 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కట్టడి కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కూడా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20 వేలు దాటింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేయేసికి పైగా రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 1387 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1124 కేసులు రికార్డయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20,395కి చేరుకుంది. 

ఈ రోజు కూడా ఏపీలో వేయికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 10376 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 64 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఆస్పత్రుల నుంచి 60,969 మంది డిశ్చార్జీ కాగా, 75,720 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 40 వేల 933కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 1349కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో చిత్తూర జిల్లాలో 789, తూర్పు గోదావరి జిల్లాలో 1215, గుంటూరు జిల్లాలో 906, కడప జిల్లాలో 646,  కృష్ణా జిల్లాలో 313, నెల్లూరు జిల్లాలో 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, ప్రకాశం జిల్లాలో 406, శ్రీకాకుళం జిల్లాలో 402, విశాఖపట్నం జిల్లాలో 983, విజయనగరం జిల్లాలో 388, పశ్చిమ గోదావరి జిల్లాలో 956 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10376కు చేరుకుంది.

ఇదిలావుంటే,  గుంటూరు జిల్లాలో 13 మంది, అనంతపురం జిల్లాలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరిలో ఇద్దరు మరణించారు. కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. 

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసులు, మరణాలు

అనంతపురం 14699, మరమాలు 114
చిత్తూరు 10378, మరణాలు 108
తూర్పు గోదావరి 20395, మరణాలు 164
గుంటూరు 14668, మరణాలు 134
కడప 7876, మరణాలు 43
కృష్ణా 6843, మరణాలు 161
కర్నూలు 16847, మరణాలు 195
నెల్లూరు 7316, మరణాలు 42
ప్రకాశం 5167, మరణాలు 63
శ్రీకాకుళం 6570, మరణాలు 70
విశాఖపట్నం 10765, మరణాలు 105
విజయనగరం 4204, మరణాలు 56
పశ్చిమ గోదావరి 12310, మరణాలు 94
మొత్తం కేసులు 140933
మొత్తం మరణాలు 1349

 

: 31/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,38,038 పాజిటివ్ కేసు లకు గాను
*60,969 మంది డిశ్చార్జ్ కాగా
*1,349 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,720 pic.twitter.com/XzKz2fb2c6

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!