కరోనా వైరస్: ఏపీలో కొత్తగా 19 కేసులు నమోదు, 11 మంది మృతి

By telugu teamFirst Published Apr 15, 2020, 11:50 AM IST
Highlights
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఏపీలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ -19 కేసుల సంఖ్య 502కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తాజాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 11 మంది మరణించారు. 

కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 16 మంది డిశ్చార్జీ అయ్యారు.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. 97 కేసులతో కర్నూలు రెండో స్థానాన్ని ఆక్రమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా వైరస్ ఉచ్చులో పడలేదు. 

జిల్లాలవారీగా ఏపీలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి...

గుంటూరు 118
కర్నూలు 97
ప్రకాశం 42
విశాఖపట్నం 20
తూర్పు గోదావరి 17
నెల్లూరు 56
కృష్ణా 45
పశ్చిమ గోదావరి 31
చిత్తూరు 23
అనంతపురం 20
కడప 33
 

: రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి లో 8, కర్నూల్ లో 6, గుంటూరు లో 4, కృష్ణ జిల్లా లో 1 కేసు నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది pic.twitter.com/A9svmhpq4h

— ArogyaAndhra (@ArogyaAndhra)


విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 12వ తేదీన మరణించాడు. ఆయన ఈ నెల 5వ తేదీన సర్వజనాస్పత్రిలో చేరాడు. అతనికి మధుమేహం, ఆస్తమా ఉన్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహింతగా ఉండడం వల్ల అతనికి కరోనా సోకింది. 

నెల్లూరు జిల్లాకు చెందిన వైద్యుడు ఈ నెల 13వ తేదీన కోవిడ్ వ్యాధికి చెన్నైలో చికిత్స పొందుతూ మరణించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా రోగితో సన్నిహితంగా మెలగడం వల్ల అతనికి కరోనా వైరస్ సోకింది. 
click me!