కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం...ఆలపాటి నిరాహారదీక్ష

Arun Kumar P   | Asianet News
Published : Apr 15, 2020, 11:47 AM IST
కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం...ఆలపాటి నిరాహారదీక్ష

సారాంశం

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ 12గంటల నిరాహారదీక్షకు దిగారు. 

గుంటూరు: కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాతపడిన వారి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఇలా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బుధవారం ఉదయం 8 గంటల నుండి తన కార్యాలయంలో ఆలపాటి నిరాహార దీక్షుకు దిగారు. సాయంత్రం 8 గంటల వరకు అంటే మొత్తంగా 12గంటలు నిరాహారదీక్షలోనే వుండనున్నారు. ఆయనతో పాటు స్థానిక టిడిపి నాయకులు పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి  రవీంద్ర నాని  దీక్షలో కూర్చున్నారు. 
 
వైసిపి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లివే: 

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి కరోనా సహాయం నిమిత్తం రూ.5000  ఇవ్వాలి. 

కరోనా వైరస్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం