మూడు జిల్లాల్లో విశ్వరూపం: ఏపీలో ఒక్క రోజులో 8 వేలకు చేరువలో కేసులు

By telugu team  |  First Published Jul 23, 2020, 6:28 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అంతు లేకుండా పోతోంది. ఒక్క రోజులో ఏపీలో 8 వేలకు చేరువలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19తో 61 మంది మృత్యువాత పడ్డారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెద్ద యెత్తున పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 7998 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,711కు చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో మరో 61 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 884కు చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వేయేసికి పైగా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 1016, తూర్పు గోదావరి జిల్లాలో 1391, గుంటూరు జిల్లాలో 1184 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 271, కడప జిల్లాలో 224, కృష్ణా జిల్లాలో 230, కర్నూలు జిల్లాలో 904 కేసులు నమోదయ్యాయి.

Latest Videos

undefined

నెల్లూరు జిల్లాలో 438, ప్రకాశం జిల్లాలో 271, శ్రీకాకుళం జిల్లాలో 360, విశాఖపట్నం జిల్లాలో 684, విజయనగరం జిల్లాలో 277, పశ్చిమ గోదావరి జిల్లాలో 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 7998 కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి.

తాజాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 14 మంది మరణించారు. గుంటూరు, కర్నూలు జిల్లాలో ఏడుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. విశాఖపట్న, విజయనగరం జిల్లాల్లో ఐదుగురేసి మృత్యువాత పడ్డారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. 

ఏపిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసులు, మరణాలు

అనంతపురం 7282, మరణాలు 81
చిత్తూరు 5939, మరణాలు 67
తూర్పు గోదావరి 10,038, మరణాలు 96
గుంటూరు 8097, మరణాలు 85
కడప 3573, మరణాలు 29
కృష్ణా 4482, మరణాలు 124
కర్నూలు 8701, మరమాలు 142
నెల్లూరు 3448, మరణాలు 22
ప్రకాశం 2704, మరణాలు 45
శ్రీకాకుళం 3575, మరణాలు 45
విశాఖపట్నం 4163, మరణాలు 59
విజయనగరం 2080, మరణాలు 28
పశ్చిమ గోదావరి 5734, మరణాలు 61  

 

: 23/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 69,816 పాజిటివ్ కేసు లకు గాను
*34,818 మంది డిశ్చార్జ్ కాగా
*884 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34,114 pic.twitter.com/9Gpgw5LPJ7

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!