నీలాంటి సీఎంలను పది మందిని చూశారు.. నారా లోకేష్

Published : Jun 17, 2020, 02:03 PM IST
నీలాంటి సీఎంలను పది మందిని చూశారు.. నారా లోకేష్

సారాంశం

అయ్యన్న పాత్రుడిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమౌతోందంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో... ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు.

అయ్యన్నపాత్రుడిది 37ఏళ్ల మచ్చలేని రాజకీయమని టీడీపీ యువనేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల వరసగా మాజీ మంత్రులు, ప్రతిపక్ష నేతల అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేపీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్టు అయ్యారు.

తాజాగా.. అయ్యన్న పాత్రుడిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమౌతోందంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో... ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు.

 

‘‘అయ్యన్నపాత్రుడు గారిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం. జగన్ గారితో కలిపి 10 మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత అయ్యన్నా పాత్రుడు గారు ’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు. 

‘‘అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టింది. జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుంది. జగన్ గారి లాంటి కుర్రకుంకలను చాలా మందినే చూసి ఉంటారు అయ్యన్నగారు ’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu