ఆంధ్రప్రదేశ్ లో 27 వేలు దాటిన కరోనా కేసులు: 300 దాటిన మరణాలు

By telugu teamFirst Published Jul 11, 2020, 5:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కర్నూలు జిల్లా కేసులకు చేరువైంది. ఏపీలో కోవిడ్ -19 మరణాల సంఖ్య 300 దాటింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 27 వేల మార్కును దాటింది. మొత్తం కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. కోవిడ్ -19 రోగుల మరణాల సంఖ్య 300 దాటింది. మొత్తం మరణాలు ఏపీలో 309 నమోదయ్యాయి.

గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1813 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 34 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

రాష్ట్రంలో నమోదైన 24,422 పాజిటివ్ కేసులకు గాను 12,300 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,714 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 20,590 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

తాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు మరణించారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కోరనా వైరస్ మరణాల సంఖ్య 309కి చేరుకుంది.

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 311 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 300 కేసులు రికార్డయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 143, గుంటూరు జిల్లాలో 68, కడప జిల్లాలో 47, కృష్ణా జిల్లాలో 123 కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో 229, నెల్లూరు జిల్లాలో 76, ప్రకాశం జిల్లాలో 63, శ్రీకాకుళం జిల్లాలో 204, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 2385 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో 428 మందికి కోరనా వైరస్ సోకింది. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా కేసులు, మరణాలు

అనంతపురం 3161, మరణాలు 23
చిత్తూరు 2509, మరణాలు 19
తూర్పు గోదావరి 2374, మరణాలు 8
గుంటూరు 2867, మరణాలు 29
కడప 1692, మరణాలు 5
కృష్ణా 2298, మరణాలు 77
కర్నూలు 3168, మరణాలు 97
నెల్లూరు 1031, మరణాలు 9
ప్రకాశం 1038, మరణాలు 5
శ్రీకాకుళం 850, మరణాలు 9
విశాఖపట్నం 1328, మరణాలు 12
విజయనగరం 495, మరణాలు 7
పశ్చిమ గోదావరి 1611 మరణాలు 9 

 

: 11/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 24,422 పాజిటివ్ కేసు లకు గాను
*12,399 మంది డిశ్చార్జ్ కాగా
*309 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,714 pic.twitter.com/eeeOs6rUWb

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!