కరోనాపైనా చంద్రబాబు, పవన్, కన్నాలు ఒకే తాటిపైకి...: వెల్లంపల్లి ఎద్దేవా

By Arun Kumar PFirst Published Mar 17, 2020, 4:29 PM IST
Highlights

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. 

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎదుర్కొలేకే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్ధానికసంస్థల ఎన్నికలను వాయిదా వేయించారని  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయనకు మౌత్ పీస్ వంటి పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ లు వాయిదానే కోరుకోగా... వామపక్షాలు ఎన్నికలంటేనే భయపడుతున్నాయన్నారు. చంద్రబాబు ఆండ్ గ్యాంగ్ ఎన్నికల కమిషనర్ ను మేనేజ్ చేసి వాయిదా వేయించారని మంత్రి ఆరోపించారు. 

రాష్ట్రంలో కేవలం ఒకే ఒక కరోనా పాజిటివ్ కేస్ నమోదు అయ్యిందని మంత్రి గుర్తుచేశారు. కరోనా వైరస్ ను తానే కనుగొనట్లు... దాని గురించి తనకే మొత్తం తెలుసన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో లేని కరోనాను ఉనట్లుగా చంద్రబాబు, పవన్, కన్నాల బ్యాచ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఒకే ఒక వారం ఆగితే ఎన్నికలు ముగిసేవన్నారు. 

read more  ఏపి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలవలం... కానిస్టేబుల్ కొడుకుకు లక్షణాలు

సీఎం జగన్మోహన్ రెడ్డి పై పందుల్లా మిగతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా కన్నా బుద్ది లేకుండా మాట్లాడుతున్నాడని...చంద్రబాబు, పవన్, కన్నా ఒకే మాట మాట్లాడుతున్నారన్నారు.పవన్ ఒకవైపు సినిమా షూటింగ్ లు చేసుకుంటూ మరోవైపు ఎన్నికలు రద్దు చేయాలని అంటున్నాడని పేర్కొన్నారు. 

ఎన్నికలు ముగిస్తే ఐదు వేల కోట్లు వచ్చేవని... దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం వుండేదన్నారు. కానీ టీడీపీ ఆదేశాలు మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను రద్దు చేశారని మండిపడ్డారు. సీఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెపుతుంటే ఎన్నికల కమిషనర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 

read more  విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... చంద్రబాబుకు పరీక్షలు

ఐదు వేల కోట్లను పవన్, కన్నాలు రాష్ట్రానికి తేగలరా..? అని ప్రశ్నించారు. లోకేష్ ను రాష్ట్ర ప్రజలు ఓడించారు కాబట్టి ఎన్నికలు జరగకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి యనమల  రామకృష్ణుడు బుద్ది లేకుండా మాట్లాడుతున్నాడని...రాష్ట్రం నష్టపోవడానికి యనమల కూడా ఓ కారకుడేనని విమర్శించారు. 
సిగ్గులేకుండా టీడీపీ నేతలు కోర్టు కు వెళ్లి ఎన్నికలు అడ్డుకుంటామని అంటున్నారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. 

click me!