విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... చంద్రబాబుకు పరీక్షలు

By Arun Kumar P  |  First Published Mar 17, 2020, 2:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ భవన్ లో థర్మల్ స్కానింగ్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే నాయకులు, కార్యకర్తలకు కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. 


అమరావతి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ మెళ్లగా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 100ను దాటింది. రెండు మరణాలు కూడా సంభవించింది. దీంతో మరింతగా వ్యాప్తిచెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. 

ఇప్పటికే జనాలు ఎక్కువగా పోగయ్యే అవకాశమున్నషాపింగ్ మాల్స్, థీమ్ పార్క్, జూపార్కు, సినిమా హాల్స్ ను మూసేయించారు. ఇక ఏపిలో స్థానికసంస్థల ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. ఇలా కేవలం ప్రభుత్వాలే కాదు పతిపక్ష పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుంది. 

Latest Videos

read more  కరోనాకు పారాసిటమాల్... కేసీఆర్, జగన్ లు చెప్పింది నిజమేనంటున్న డాక్టర్లు

మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు రాకూడదని ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు రావొద్దని పిలుపునిచ్చారు. ఇలా అత్యవసర పనులపై వచ్చే నాయకులు, కార్యకర్తలను కూడా థర్మల్ స్కానర్ తో పరీక్షించిన తర్వాతే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‍ కు విచ్చేసిన చంద్రబాబును కూడా స్కానింగ్ చేసిన తర్వాతే లోపలికి పంపారు సిబ్బంది. 

కరోనా వైరస్ లక్షణాల్లో మొదటిది అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం వుండటం. కాబట్టి థర్మల్ స్కానింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి... 100 డిగ్రీల లోపల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. అంతకంటే  ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయితే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది సూచిస్తున్నారు కార్యాలయ సిబ్బంది. 

read more  ఓ పక్క కరోనా అలజడి... ఎన్నికల కోసం రమాకాంత్‌తో భేటీ: జగన్‌పై బాబు ఫైర్

టిడిపి అధినేత ఆదేశాల మేరకే  సిబ్బంది ఈ స్కానింగ్ ను ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జగ్రత్తలను సిబ్బందికి వివరించిన చంద్రబాబు. ఈ విషయంలో అలసత్వం వహించరాదని వారికి  సీరియస్ గా ఆదేశించారు. 

click me!