ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం..

Published : May 10, 2021, 10:06 AM IST
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజు గట్టు ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం పట్టణానికి చెందిన కోటేశ్వరరావు ఆయన కుమారుడు వెంకట కృష్ణారావు గుంటూరు వైద్యశాలకు వెళ్లి తిరిగివస్తున్నారు. మార్కాపురం సమయంలోకి రాగానే కారు అదుపుతప్పి కాలనీకి చెందిన కటికల ప్రసాద్‌ ఇంట్లోకి దూసుకెళ్లింది.

ప్రమాదంలో బాపూజీ కాలనీకి చెందిన డ్రైవర్ కటికల ప్రవీణ్‌  (30) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని  తీవ్రగాయాలైన ఇద్దరినీ మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటకృష్ణారావు మృతిచెందాడు. స్వల్ప గాయాలైన కోటేశ్వరరావుకు మెరుగైన వైద్యం నిమిత్తం పట్టణంలో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

అయితే, కాలనీ దగ్గర కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కాలనీ పక్కన ఉన్న రోడ్డుకు ఇరువైపులా డైవర్షన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కార్ డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో ఇంటి లోపల కటికల మేరీ కుమారి కుమారుడు బయటే కూర్చుని ఉన్నాడు. వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంటి ముందున్న గోడను కారును బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.

PREV
click me!

Recommended Stories

Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu
Ganta Srinivasa Rao Pressmeet: సింహాచలం ప్రసాద ఘటనపై గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్| Asianet Telugu