గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు బైక్ ను డీకొట్టడం గత అర్థరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గత అర్థరాత్రి చోటు చేసుకుంది.
ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరుకు చెందినవారు. మృతులను పోలీసులు గుర్తించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనపై ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే 113 తాళ్ళూ రుకు చెందిన షేక్ చిన్న హుసేన్ (50), షేక్.నూర్జహా (45), షేక్ హుస్సేన్ (25) లు ద్విచక్రవాహనంపై అమరావతి లోని ఓ గుడిలో నిద్ర చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కారు జోసిల్ కంపెనీ వద్ద ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
వాహనాన్ని ఢీ కొట్టి పారిపోతున్న కారుని స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికీ సంఘటన స్థలానికి చేరుకోని పోలీసుల వద్దకు కారు డ్రైవర్ వెళ్ళి....దాన్ని స్వల్ప ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుండి జారుకున్నారు.