ఆనందయ్య స్వగ్రామం కృష్ణపట్నంలో కరోనా వైరస్ వ్యాధి

By telugu news teamFirst Published May 31, 2021, 7:35 AM IST
Highlights

ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆ ముందు ఎంత వరకు నిజంగా పనిచేస్తుందనే విషయంపై పరిశోధన మొదలుపెట్టారు. అప్పటి వరకు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లేకుండా చేశారు. దీంతో.. ఆయన కూడా మందు పంపిణీ నిలిపివేశారు.

దేశం మొత్తం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈ మహమ్మారి కలకలం రేపుతూనే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం అసలు కరోనా అంటూ లేదని గత కొంతకాలం వార్తలు వచ్చాయి.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం అనే గ్రామంలో అసలు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదని.. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు సైతం కరోనా నుంచి దూరంగా ఉన్నారంటూ వార్తలు అందరి దృష్టి ఆకర్షించాయి. కారణమేంటాఅని ఆరా తీయగా.. ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందే కారణం అని తెలిసింది. దీంతో.. కుప్పలు తెప్పలుగా జనాలు అక్కడ క్యూలు కట్టడం మొదలుపెట్టారు.

ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆ ముందు ఎంత వరకు నిజంగా పనిచేస్తుందనే విషయంపై పరిశోధన మొదలుపెట్టారు. అప్పటి వరకు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లేకుండా చేశారు. దీంతో.. ఆయన కూడా మందు పంపిణీ నిలిపివేశారు.

ఇలా మందు పంపిణీ నిలిపివేసి వారం రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ కృష్ణపట్నం గ్రామంలో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం. ఆదివారం ఆ గ్రామంలో వైద్య సిబ్బంది కరోనా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.

కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ముగ్గురికి ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. వారిలో ఇద్దరికి పాజిటివ్ తేలినట్లు గుర్తించారు. మరో 27 మందికి స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని.. వారిని ఆర్టీపీసీఆర్ నిమిత్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపినట్లు వివరించారు. మరో రెండు రోజులపాటు గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

కాగా... ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయడం వల్లనే తమ గ్రామంలో కరోనా కేసులు నమోదౌతున్నాయని గ్రామస్థులు భావిస్తుండటం గమనార్హం. 

click me!