వలసకూలీలకు రూ. 10వేలు, వసతి కల్పించాలి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Published : Apr 23, 2020, 12:33 PM IST
వలసకూలీలకు రూ. 10వేలు, వసతి కల్పించాలి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సారాంశం

వలసకూలీలకు వసతితో పాటు రూ. 10 వేలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని  ఏపీ హైకోర్టు ఆదేశించింది. వలస కూలీలను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: వలసకూలీలకు వసతితో పాటు రూ. 10 వేలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని  ఏపీ హైకోర్టు ఆదేశించింది. వలస కూలీలను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారించింది. వలసకూలీలను 24 గంటల్లో గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు.  వలసకూలీలకు భోజనంతో పాటు మందులను అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

also read:లాక్ డౌన్ ఎఫెక్ట్... వలన కూలీల కోసం నేడే హెకోర్టు విచారణ

లాక్‌డౌన్ కారణంగా  గుంటూరులో ఇద్దరు, గుజరాత్ రాష్ట్రంలో ఇద్దరు మరణించిన విషయాన్ని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఆ పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రామకృష్ణ వినతి మేరకు ఈ పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా భావించి గురువారం నాడు విచారించి ప్రభుత్వానికి ఈ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు వెళ్లూ మార్గమధ్యలో మృతి చెందిన ఘటనలు దేశంలో చోటు చేసుకొన్నాయి. వాహనాలు లేక కాలినడకనే చాలా మంది తమ గ్రామాలకు చేరుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!