
ఈ ఏడాది జూలై 20వ తేదీ వరకు కరోనా తీవ్రత బలీయంగానే ఉంటుందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ ఏడాది ఉగాది రోజున (ఏప్రిల్ 13వ తేదీన) స్వరూపానందేంద్ర సరస్వతీ పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై ఆయన స్పష్టమైన విశ్లేషణ చేశారు.
ఈ ఏడాది అన్ని గ్రహాలు రాహువు – కేతువు మధ్యలో ఉన్న కారణంగా ఇబ్బందికరమైన సంవత్సరమే అవుతుందని స్వరూపానందేంద్ర చాలా స్పష్టంగా చెప్పారు. కుజుడు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవని తెలిపారు.
జూలై 20వ తేదీ వరకు కరోనా మహమ్మారి బలంగా ఉంటుందని విశ్లేషించారు. కరోనా తీవ్రత ఎప్పటికి తగ్గుతుందనేది ఆ తర్వాతే నిర్ణయం చేయాలి తప్ప, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొందని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ విశ్లేషణను కొందరు సోషల్ మీడియాలో అసత్యంగా ప్రచారం చేస్తుండటాన్ని విశాఖ శారదా పీఠం ఖండించింది. ఈ నేపథ్యంలోనే పీఠాధిపతుల విశ్లేషణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
"