సత్తెనపల్లి యువకుడి మృతిపై ఐజీ సీరియస్... ఎస్సైపై సస్పెన్షన్ వేటు

By Arun Kumar P  |  First Published Apr 20, 2020, 12:34 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ఓ యువకుడి మృతికి కారణమయ్యింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని  సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. 


సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడేవాడని ఐజీ ప్రభాకర్ రావు తెలిపారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతున్నా అతడు బయటకు రావడంతో  పోలీసులు అతన్ని ప్రశ్నించారని...అయితే అందుకు అతడు సరయిన సమాధానం చెప్పలేకపోయాడని అన్నారు. దీంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా భయంతో కుప్పకూలిపోయాడని తెలిపారు. 

అయితే పోలీసుల దాడిలో అతడు మృతిచెందాడని ప్రచారం జరుగుతోందని... దీనిపై నిజానిజాలను తేల్చి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే గౌస్ ను బెదిరించిన స్థానిక ఎస్సై రమేష్ పై వేటు పడింది. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. 

Latest Videos

click me!