చంద్రబాబుకు వైఎఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

Published : Apr 20, 2020, 12:18 PM IST
చంద్రబాబుకు వైఎఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

సారాంశం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జగన్ తన జన్మదిన వేడుకల సందేశంలో ఆశించారు. 

 

చంద్రబాబు నాయుడు సోమవారం తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. హైదరాబాదులో ఉన్న చంద్రబాబు ఈ రోజు నిరాడంబరంగా తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. 

ఇదిలావుంటే, చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనవడు దేవాన్షు వెరైటీగా ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

PREV
click me!

Recommended Stories

మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ