కరోనా కల్లోలం : కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి.. !

By AN TeluguFirst Published Apr 26, 2021, 1:47 PM IST
Highlights

తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులున్నాయని.. వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులున్నాయని.. వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. 

కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదాని మీద సుదీర్ఘంగా చర్చించారు. 

రేపటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు, అధికారులకు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశా మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా నగర పాలక కమిషనర్ ప్రకటించారు. 

ఓ వైపు కేసుల నియంత్రణ మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

click me!