అదే అపశృతి, ఉద్యోగులంతా తృప్తిగా ఉన్నారు:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల

By narsimha lode  |  First Published Feb 6, 2022, 4:02 PM IST

తమతో చర్చల విషయంలో వ్యతిరేకత మినహా ఉద్యోగ సంఘాలు సంతృప్తితో ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.


అమరావతి: ప్రభుత్వంతో చర్చల విషయంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేక అపశృతి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrioshna Reddy అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. AP Employees సంఘాలతో చర్చల సందర్భంగా ఈ విషయమై తమ అభ్యంతరాలపై రాత్రే చెప్పకుండా సమావేశం నుండి బయటకు వెళ్లిపోయి మాట్లాడడం సరైందికాదన్నారు. మినిట్స్ కూడా తయారయ్యాక బయటకెళ్లి మాట్లాడడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం చర్చలు విఫలమైనట్టుగా ప్రకటించాయి. తాము భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా తేల్చి చెప్పాయి.ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా  సీఎం YS Jagan మాట్లాడి సర్దుబాటు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉన్నదాంట్లో ఇంకా మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా మేలు చేయాలని జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

Fitment పెంచడానికి ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేదన్నారు.ఫిట్ మెంట్ కాకుండా ఇతర విషయాల్లో ఉద్యోగులు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొంటే  అత్యుత్తమ పీఆర్సీ ఇచ్చామన్నారు. ఛలో విజయవాడలోనూ ప్రభుత్వం ఉద్యోగులను ఏమీ చేయలేదన్నారు. 


 

click me!