ఏపీలో కోర్టు ధిక్కార కేసు.. ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్..

By AN Telugu  |  First Published Jul 24, 2021, 4:44 PM IST

ఈ మేరకు సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. 

అమరావతి : ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ మేరకు సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. 

Latest Videos

undefined

ఆదేశాలు అమలుచేసినప్పటికీ గత వాయిదాకు సత్యనారాయణ ఆలస్యంగా హాజరయ్యారు. కేసు విచారణలో సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.

రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు తెలిపింది. దీంతో శిక్షను నిలిపి వేయాలని సత్యనారాయణ, ఆయన తరపు న్యాయవాది  కోరారు. కాగా, సత్యనారాయణ విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తా మని హైకోర్టు తెలిపింది. 
 
click me!