కోర్టు ధిక్కరణ కేసు : హైకోర్టుకు ఏపీ డీజీపీ.. కౌంటర్ దాఖలుకు సమయం..

Published : Feb 28, 2023, 07:25 AM IST
కోర్టు ధిక్కరణ కేసు : హైకోర్టుకు ఏపీ డీజీపీ.. కౌంటర్ దాఖలుకు సమయం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ కింద ఆయన హాజరయ్యారు. అయితే, కౌంటర్ దాఖలుకు సమయం అడగగా.. కోర్టు సానుకూలంగా స్పందించింది. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు ధిక్కరణ కేసులో సోమవారం హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. కాదా ఈ కేసు మీద కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.  ఆ తర్వాత విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్, మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా ఇదే కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను ఇక్కడ లేనని కేరళలో ఓ మీటింగ్కు అటెండ్ అవ్వడానికి  వెళ్ళినందున..రాలేకపోతున్నానని.. క్షమించాలని.. తరువాతి విచారణకు హాజరవుతానని గౌతమ్ సవాంగ్ కోర్టులో అఫిడబిట్ దాఖలు చేశారు. దీనికి అనుకూలంగా న్యాయస్థానం  స్పందించింది. 

సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం గంగారావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న సిహెచ్ రాజశేఖర్ కు 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం పదోన్నతి కల్పించాలి. 2019 సెప్టెంబర్ 24న ఈ వ్యవహారాన్ని..పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు. . దీంతో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఇటీవల విచారణ జరిపి.. ప్రస్తుత డిజిపి, మాజీ డిజీపీలు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు గుడ్‌న్యూస్.. నేడు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల

ఈ నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. రాజేంద్రనాథ్ రెడ్డి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయమూర్తి సుమన్ వాదనలు వినిపించారు. ‘రాజశేఖర్ పదోన్నతి ప్రతిపాదనను డిపార్ట్మెంట్ పదోన్నతి కమిటీ తిరస్కరించింది. దీనికి కారణం ఆయన ఏసీఆర్ అంటే వార్షిక రహస్య నివేదిక అంత సంతృప్తికరంగా లేదు. దీని మీద పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు మాకు కొంత సమయం కావాలి అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు.

ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి దీనిమీద స్పందిస్తూ.. పదోన్నతి కల్పించే విషయంలో అన్ని అంశాలను పునః పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున కౌంటర్ వేసేందుకు సమయాన్ని కేటాయించారు. ఈ మేరకు విచారణను మార్చి 20కి వాయిదా వేశారు.  ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

పెమ్మసాని స్పీచ్ కి దద్దరిల్లిన సభ సీఎం చంద్రబాబు ఫిదా | Asianet News Telugu
CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu