పదో తరగతి బాలికతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి, సస్సెండ్...

Published : Aug 21, 2021, 10:14 AM IST
పదో తరగతి బాలికతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి, సస్సెండ్...

సారాంశం

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేక సమయం చూసి, కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ కు దేహ శుద్ధి చేశారు.

గుంటూరు : బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలవాల్సిన కానిస్టేబులే కాటేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెడితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీ రమేష్ 2019లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 

గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబంతోపాటు ఓ ఇంట్లో పై అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. కింద పోర్షన్ లో ఓ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుటుంబం ఉంటోంది. పదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ చనువుగా వ్యవహరిస్తున్నారు. తరచూ బాలికతో మాట్లాడేందుకు రమేష్ ప్రయత్నిస్తుండటంతో ఆమె కుటుంబం తమ కుమార్తెతో మాట్లాడొద్దన హెచ్చరించింది. 

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేక సమయం చూసి, కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ కు దేహ శుద్ధి చేశారు. అనంతరం దిశ స్టేషన్ లో రమేష్ ను అప్పగించి ఫిర్యాదు చేశారు. కాగా, కానిస్టేబుల్ రమేష్ను సస్పెండ్ చేస్తూ.. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu